ఏపీ మాదిరే.. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- మార్చి 7న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- అదే రోజున తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ప్రగతి భవన్లో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరైనట్లుగా సమాచారం. మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఈ సందర్భంగా కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రకటన త్వరలో విడుదల కానుంది.