రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని కోరారు:మంత్రి ప్రశాంత్ రెడ్డి
- తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోంది
- మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు వారిని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు
- తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారన్న మంత్రి
మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని అడిగారని, కర్ణాటక రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని కోరారని... తెలంగాణలో అభివృద్ధి లేకపోతే తెలంగాణలో కలపాలని ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని అన్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిని గ్రామాల్లోకి కూడా రానివ్వబోమని చెప్పారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ మనకు అవసరం లేదని అన్నారు.