ముంబయిలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్... తప్పతాగి పోలీసులపై చిందులు
- తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కావ్యా థాపర్
- ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తూ మరో వాహనాన్ని ఢీ
- కారు డ్రైవర్ పై ఆగ్రహం
- న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన పోలీసులు
- జ్యుడీషియల్ కస్టడీ విధింపు
ఈ ఘటన గురువారం వేకువజామున జరిగింది. ముంబయిలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. దాంతో కావ్యా థాపర్ సదరు కారు డ్రైవర్ ను దూషించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై కూడా అసభ్య పదజాల ప్రయోగం చేసింది.
ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కావ్యా థాపర్ ఓ ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన కావ్యా థాపర్ ముంబయిలో నివసిస్తోంది.