మా శ్రీను అన్న... కాలేజీ రోజుల నుంచి మాకు ఆప్తుడు: వైసీపీ ఎంపీపై నాగబాబు ట్వీట్
- హైదరాబాదులో బొత్స తనయుడి పెళ్లి
- హాజరైన నాగబాబు
- వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో భేటీ
"మా శ్రీను అన్న... ఇప్పుడు పార్టీలు వేరైనా మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి మాకు చాలా ఆత్మీయుడు. మా కాలేజీ రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లిలో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్నారు.