అది మణిపురి సంస్కృతి.. రాహుల్ జీ తెలుసుకోండి: ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చురక
- ఒకరి ఇంట్లోకి వెళ్లే ముందు పాదరక్షలు విడుస్తాం
- ఇది పురాతన మణిపురి సంప్రదాయం
- మణిపూర్ సంస్కృతి గురించి తెలుసుకోండి
- రాహుల్ కు బిరేన్ సింగ్ సూచన
దీనిపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్పందిస్తూ.. దీనిని మణిపురి సంస్కృతిలో భాగంగా పేర్కొన్నారు. ‘‘ఎవరి ఇంట్లోకి అయినా అడుగు పెట్టే ముందు పాదరక్షలను బయట విడిచి వెళ్లడం అన్నది మణిపురి సంస్కృతిలో ఉన్న పురాతన సంప్రదాయం. దీనిని అవమానంగా ప్రచారం చేయడం అంటే వారు మణిపురి సంస్కృతిని పట్టించుకోకపోవడమే. మిస్టర్ రాహుల్ గాంధీ, మణిపూర్ గురించి మాట్లాడే ముందు మణిపురి సంస్కృతి గురించి కొంత తెలుసుకోండి’’ అంటూ బిరేన్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.