వచ్చే వారంలో సెట్స్ పైకి ఎన్టీఆర్ .. కొరటాల!
- ఎన్టీఆర్ తో కొరటాల ప్రాజెక్టు
- ఫిబ్రవరి 7 నుంచి మొదలు
- స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్
- రాజకీయాలను టచ్ చేస్తూ సాగే కథ
ఈ కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆలస్యమైంది. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుందని చెబుతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బస్తీకి చెందిన యువకుడిగా .. బస్తీ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడట. ఈ విషయంలో అవినీతి రాజకీయాలను .. రాజకీయనాయకులను ఎదుర్కొనే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక విషయంలో క్లారిటీ రానుంది.