'మానాడు' దర్శకుడితో చైతూ!
- వరుస హిట్లతో ఉన్న చైతూ
- ముగింపుదశలో 'థ్యాంక్యూ'
- వెంకట్ ప్రభు కథకు గ్రీన్ సిగ్నల్
- లైన్లో పరశురామ్, విజయ్ కనకమేడల
ఇక తాజాగా ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇటీవల 'మానాడు' సినిమాతో వెంకట్ ప్రభు హిట్ కొట్టాడు. ఈ సినిమాను ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ వారు రీమేక్ చేస్తున్నారు. ఆయన ఇటీవల చైతూను కలిసి కథ చెప్పడం .. చైతూ ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు.
ఇక చైతూతో సినిమాలు చేయడానికి పరశురామ్ .. విజయ్ కనకమేడల .. నందిని రెడ్డి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ పరశురామ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడు. మరి ఈ ప్రాజెక్టులలో ఎవరితో ముందుగా ఆయన సెట్స్ పైకి వెళతాడనేది చూడాలి. ఇక చైతూ వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.