విజయనగరం నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ!
- విడుదలకు సిద్ధమైన 'ఆర్ ఆర్ ఆర్'
- పట్టాలపైకి వెళుతున్న కొరటాల సినిమా
- సుకుమార్ ద్వారా బుచ్చిబాబు ప్రాజెక్టులో కదలిక
- ఎన్టీఆర్ ను కొత్తగా చూపించనున్న బుచ్చిబాబు
అసలు ఈ పాటికే ఈ ప్రాజెక్టు మొదలుకావలసి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. అందువల్లనే ఆలస్యమైంది. సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. సుకుమార్ ద్వారా ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఒప్పించాడట. ఈ కథ అంతా కూడా విజయనగరం నేపథ్యంలో నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తూ వచ్చినదానికీ, ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.