అమెజాన్ ప్రైమ్ కి విక్రమ్ 'మహాన్'
- విక్రమ్ హీరోగా 'మహాన్'
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- కీలకమైన పాత్రలో తనయుడు ధృవ్
- వచ్చే నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఇక ఈ సినిమాకి మరో ప్రత్యేకత కూడా ఉంది .. అదేమిటంటే విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేయడం. తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో, సహజంగానే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమా థియేటర్లకు వెళుతుందా? ఓటీటీలో వస్తుందా? అనే విషయంలో నిన్నమొన్నటివరకూ ఒక అయోమయం నెలకొంది. కానీ ఈ సినిమా అమెజాన్ లో వచ్చేనెల 10 నుంచి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాలో వాణి భోజన్ .. సిమ్రాన్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.