ఆసక్తిని రేపుతోన్న 'ఫ్లాష్ బ్యాక్' .. గ్లామరస్ పాత్రలో అనసూయ!
- ప్రభుదేవా హీరోగా 'ఫ్లాష్ బ్యాక్'
- కథానాయికగా రెజీనా
- కీలకమైన పాత్రలో అనసూయ
- తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే టైటిల్ తో తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. డిఫరెంట్ లుక్ తో ప్రభుదేవా కనిపించనున్న ఈ సినిమాకి డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రెజీనా .. అనసూయ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో రెజీనా ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అనసూయ మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. 'పుష్ప'లో అనసూయను గ్లామరస్ గా చూద్దామని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ఈ సినిమా ఆ ముచ్చట తీర్చనుందన్న మాట.
.