చిరంజీవి హ్యాష్ ట్యాగ్ కు విజయ్ దేవరకొండ మద్దతు
- ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ
- వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం
- తీవ్రంగా ఖండించిన చిరంజీవి
- GiveNewsNotViews హ్యాష్ ట్యాగ్ ను పంచుకున్న వైనం
దీనిపై టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. GiveNewsNotViews ఉద్యమానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు.
అంతకుముందు చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ... జగన్ తో సమావేశానికి రాజకీయ రంగు పులిమి, పక్కదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అవన్నీ పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.