'సూపర్-100' బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన తలైవా 'రజనీకాంత్ ఫౌండేషన్'
- ఇటీవల రజనీకాంత్ పుట్టినరోజు
- నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే కార్యాచరణపై ప్రకటన
- సూపర్-100 బ్యాచ్ ఏర్పాటు
- పేద విద్యార్థులకు పూర్తి ఉచితంగా శిక్షణ
100 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం అని రజనీకాంత్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రస్తుతం సూపర్-100 బ్యాచ్ కు రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఇటీవల (డిసెంబరు 12) తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు.