రజనీకాంత్ సేవలకు మరింత విస్తృతి.. ఫౌండేషన్ పేరిట ప్రత్యేక వెబ్ సైట్
- సేవలు ఏవైనా ముందుగా తమిళనాడు నుంచే
- టీఎన్ పీఎస్సీ పరీక్షలపై ఉచిత శిక్షణ
- ‘సూపర్ 100 బ్యాచ్’ కోసం విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోవచ్చు
ఫౌండేషన్ సేవలు తొలుత తమిళనాడుకే పరిమితమని ప్రకటించింది. తమిళ ప్రజల దీవెనలే తాను ఈ స్థాయికి రావడానికి కారణమన్న రజనీకాంత్ వ్యాఖ్యలను గుర్తు చేసింది. కనుక ఫౌండేషన్ సేవలు ఏవైనా కానీ ముందుగా తమిళనాడు నుంచే ఉంటాయని పేర్కొంది. టీఎన్ పీఎస్సీ గ్రూపు పరీక్షలపై శిక్షణ కార్యక్రమం ‘సూపర్ 100 బ్యాచ్’ కోసం విద్యార్థులు ఉచితంగా తమ పేర్లను వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.