ముగ్గురు హీరోయిన్లతోను డాన్స్ చేయాలనుంది: కృష్ణంరాజు
- మీ దగ్గరికి పరిగెత్తుకు రావాలని ఉంది
- ఈ స్టేజ్ పై డాన్స్ చేయాలనుకున్నాను
- మీకు ఒక రెబల్ స్టార్ ను ఇచ్చాను
- 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు
ఈ వేదికపై కృష్ణంరాజు మాట్లాడుతూ .. "మీ అందరినీ ఇలా చూస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకోవాలని .. కౌగిలించుకోవాలని ఉంది. కానీ భగవంతుడు చిన్న శిక్ష వేశాడు. వారం పది రోజుల్లో తగ్గిపోతుందిలే. అప్పుడు వచ్చి డాన్స్ చేస్తాను. మీ అందరికీ ఒక రెబల్ స్టార్ ను ఇచ్చాను .. ఈ రెబల్ స్టార్ ఓ 50 ఏళ్లపాటు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు" అన్నారు.
" మీకు డాన్స్ చేసే అవకాశం ఇస్తే జయసుధ .. జయప్రద .. పూజ హెగ్డేలలో ఎవరితో చేస్తారు?" అని నవీన్ పోలిశెట్టి సరదాగా కృష్ణంరాజును అడిగాడు. అందుకు ఆయన "ముగ్గురితోను చేస్తాను" అంటూ నవ్వేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా, ఆయన ఈ వేడుకకి రావడం .. అలా మాట్లాడటం ఆయన అభిమానులకు నిండుగా అనిపించింది.