ప్లీజ్.. వామికా ఫొటోలు తీయొద్దు: ఫొటోగ్రాఫర్లకు కోహ్లీ విజ్ఞప్తి
- సౌతాఫ్రికా పర్యటనకు కోహ్లీ సేన
- విమానాశ్రయంలో వామిక ఫొటోలు తీసే యత్నం
- వద్దని రిక్వెస్ట్ చేసిన కోహ్లీ వీడియో వైరల్
కోహ్లీ సారథ్యంలో భారత జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం నిన్న దక్షిణాఫ్రికా బయలుదేరింది. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్టు వద్ద ఎదురుచూస్తున్న వీడియోగ్రాఫర్లు వామిక ఫొటోను తీసేందుకు ప్రయత్నించగా కోహ్లీ వారించాడు. పాప ఫొటోలు తీయొద్దని వారిని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది.