అమిత్ షాతో భేటీ అయిన వైసీపీ ఎంపీలు!
- అమిత్ షాను కలిసిన విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి
- కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని విన్నపం
- పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరిన వైనం
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని... ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదముద్ర వేయాలని ఈ సందర్భంగా అమిత్ షాను ఎంపీలు కోరారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని విన్నవించారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.