అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ
- రియలిస్టిక్ క్యారెక్టర్లు చేయడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్
- అలాంటి పాత్రలు పవన్, మహేశ్, చిరు, రజనీ చేయగలరా?
- 'పుష్ప' అంటే పుష్పం కాదు.. అదొక ఫైర్
రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సుపర్ స్టార్ అల్లు అర్జున్ అని వర్మ కితాబునిచ్చారు. ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నించారు. 'పుష్ప' అంటే పుష్పం కాదని... అది ఫైర్ అని అన్నారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.
ఈ నెల 17న 'పుష్ప' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్ని సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.