జర్మనీలో మళ్లీ లాక్ డౌన్... వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు బయట తిరగడంపై నిషేధం!
- వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
- 20కి పైగా దేశాల్లో ఉనికి
- అప్రమత్తమైన ఈయూ దేశాలు
- జర్మనీలో షరతులతో కూడిన లాక్ డౌన్
- వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే యోచనలో జర్మనీ
అయితే, ఈసారి షరతులతో కూడిన లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికే ఈ లాక్ డౌన్ వర్తిస్తుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారు బయట తిరగడం నిషేధం. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఎలాంటి నిషేధం ఉండదు. కాగా, జర్మనీలో వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేసేందుకు ఓ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.