'పుష్ప' షూటింగులో జాయినైన సమంత!
- షూటింగు దశలో 'పుష్ప'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- స్పెషల్ సాంగ్ కి సమంత
- డిసెంబర్ 17వ తేదీన విడుదల
ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ రోజున మొదలైంది. సమంత తదితరులపై ఈ పాటను కొన్ని రోజుల పాటు చిత్రీకరిస్తారట. ఈ సినిమా హైలైట్స్ లో ఈ పాట ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ఉంటుంది.
అలాంటి ఐటమ్ నెంబర్ ఈసారి సమంతపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకు వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రష్మిక కథానాయికగా కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఫాహద్ ఫాజిల్ .. జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.