అమరులైన జవాన్లకు ఎక్స్ గ్రేషియా ఇంకా ఇవ్వలేదు: కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
- గాల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు
- సంతోష్ కుమార్ కుటుంబానికి తప్ప ఎవరికీ పరిహారం ఇవ్వలేదు
- ఎక్స్ గ్రేషియా ప్రకటించి 17 నెలలు అవుతోంది
ఎక్స్ గ్రేషియా ప్రకటించి 17 నెలలు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరిహారం అందలేదని విమర్శించారు. వీర జవాన్ల పరిస్థితే ఇలా ఉంటే.... అమరులైన 700 మంది రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్ గ్రేషియా అందడానికి మరెంత కాలం పడుతుందోనని అన్నారు. వీర జవాన్ల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.