కరోనా బారిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. ఆరోగ్యం విషమం.. అపస్మారకస్థితిలో కుమారుడు!
- నాలుగు రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
- హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్న శివశంకర్ భార్య
- 800కుపైగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ మాస్టర్
భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పదికిపైగా భాషల్లో పనిచేశారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మగధీర సినిమాలోని ‘ధీర.. ధీర..’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు.