'క్యాలీఫ్లవర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- హాస్యప్రధానమైన 'క్యాలీఫ్లవర్'
- ద్విపాత్రాభినయంతో సంపూ
- దర్శకుడిగా ఆర్కే మలినేని
- ఈ నెల 26వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను అల్లరి నరేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. "కిల్ బిల్ కళాకార్ సంపూర్ణేషుడు .. జిల్ జిల్ జిగా జిగా మండే సూర్యుడు .. హల్ చల్ చేస్తున్నాడు ఈ ఆండ్రాయుడు .. క్రేజీ క్యాలీఫ్లవర్ నామధేయుడు" అంటూ ఈ పాట జోరుగా హుషారుగా సాగుతోంది.
ప్రజ్వల్ క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా సాకేత్ ఆలపించాడు. ఈ పాటకి శశి మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఆశాజ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆర్కే మలినేని దర్శకత్వం వహించాడు. సంపూ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాతో, ఆయన కెరియర్ మరింత పుంజుకుంటుందేమో చూడాలి.