శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఉన్నట్టే!
- శివ నిర్వాణ ఖాతాలో రెండు హిట్లు
- అంచనాలు అందుకోని 'టక్ జగదీష్'
- జనవరిలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు
- ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగు
ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' బాగోలేదని అనలేం .. అలాగని హిట్ అని చెప్పలేం. మొత్తం మీద ఫరవాలేదనిపించుకుంది. ఈ సినిమాకి ముందే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ ఒక సినిమా చేయాలనుకున్నాడు. స్క్రిప్ట్ రెడీ చేయడం కూడా జరిగిపోయింది. అయితే పూరి నుంచి 'లైగర్' ఛాన్స్ రావడంతో విజయ్ దేవరకొండ అటువైపు వెళ్లాడు.
దాంతో ఈ సినిమా లేనట్టేననే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఉందనే విషయాన్ని విజయ్ దేవరకొండ సన్నిహితులు చెబుతున్నారు. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళతారని చెబుతున్నారు. మరి ప్రస్తుతం శివ నిర్వాణ సిద్ధం చేస్తున్న కథ ఎవరికోసమో!