కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు చేసింది: మంత్రి నిరంజన్ రెడ్డి
- వరి ధాన్యం కొనకపోతే కేంద్రానికే నష్టం
- ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి
- ఐకమత్యంతో రైతులదే విజయమన్న మంత్రి
రాష్ట్రంలో అన్ని సీజన్లలోనూ వరి పండుతుందని చెప్పిన ఆయన.. ఈ వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో వరి వేశారన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం కలుగుతోందని మండిపడ్డారు. కేంద్రం ఒప్పందం చేసుకున్న ధాన్యాన్నీ కొనట్లేదని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని, లేదంటే నష్టపోక తప్పదని హెచ్చరించారు. రైతులు ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని ఆయన విమర్శించారు.