వైయస్ వివేకా హత్య కేసు.. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్!
- శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
- హైదరాబాద్ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్న వైనం
- అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు తెలిపిన అధికారులు
హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని అక్కడే అదుపులోకి తీసుకొని నగరంలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కార్యాలయంలో విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు అధికారులు సమాచారం అందించారు.