నాగ్ చేతుల మీదుగా 'అనుభవించు రాజా' ట్రైలర్!
- రాజ్ తరుణ్ నుంచి 'అనుభవించు రాజా'
- కొత్త కథానాయిక పరిచయం
- దర్శకుడిగా శ్రీనివాస్ గవిరెడ్డి
- ఈ నెల 26వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒక ముహూర్తాన్ని సెట్ చేశారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ ట్రైలర్ ను నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
ఈ కథ ఇటు పల్లెలోను .. అటు పట్నంలోను నడుస్తుంది. హీరోను జల్సారాయుడిగాను .. ఓ చిన్నపాటి జాబ్ చేసుకుంటున్నవాడిగాను చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొంతకాలంగా రాజ్ తరుణ్ కి హిట్ పడలేదు. దాంతో ఆయన ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.
.