'గని' నుంచి ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు లుక్!
- వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గని'
- దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయం
- కీలకపాత్రలో సునీల్ శెట్టి
- డిసెంబర్ 3వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ముఖ్యమైన తారాగణానికి సంబంధించిన వివరాలను అందించడమే కాకుండా, వారు పోషించిన పాత్రల తాలూకు లుక్ ను రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో నదియా పోషించిన 'మాధురి' పాత్రను పరిచయం చేస్తూ నిన్న ఆమె లుక్ ను వదిలారు.
ఇక జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ రోజున ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. 'శ్రీమంతుడు' .. 'నాన్నకు ప్రేమతో' లుక్స్ కి దగ్గరగా ఆయన లుక్ డీసెంట్ గా ఉంది. ఇక తెరపై ఆ పాత్ర స్వభావమేమిటనేది చూడాలి. ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్న సంగతి తెలిసిందే.
.