సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కామెడీ చేయాలనుందంటున్న సాయిపల్లవి
- భారీ రేటుకి మహేశ్ సినిమా ఓవర్సీస్ హక్కులు
- నిఖిల్ '18 పేజెస్' విడుదల తేదీ ఖరారు
* మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ పంపిణీ సంస్థ ఈ హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
* పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న '18 పేజెస్' చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించినట్టు తాజా సమాచారం. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.