టీఆర్ఎస్ ఒక ఎన్నికలో ఓడినప్పటికీ మరో ఎన్నికలో విజయం సాధిస్తోంది: మంత్రి వేముల
- ఎన్నికల్లో గెలుపోటములు సహజం
- ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలను చూసింది
- గతంలో నాగార్జున సాగర్‌లో గెలిచాం
- బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న సీటునూ గెలుచుకున్నాం
తమ పార్టీ ఒక ఎన్నికలో ఓడినప్పటికీ మరో ఎన్నికలో విజయం సాధిస్తుందని తెలిపారు. తాము గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న సీటును కూడా గెలుచుకున్నామని అన్నారు. కాగా, ఆయన ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగానే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అంశంపై స్పందించారు.