'ఆచార్య' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!
- 'ఆచార్య' ఫస్టు సింగిల్ కి భారీ రెస్పాన్స్
- ఈ నెల 5వ తేదీన రానున్న సెకండ్ సింగిల్
- చరణ్ - పూజ హెగ్డేలపై చిత్రీకరించిన మెలోడీ
- ఫిబ్రవరి 4వ తేదీన సినిమా విడుదల
ఇక ఈ సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన 'లాహే లాహే' సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. చరణ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించిన 'నీలాంబరి' మెలోడీ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాలో సిద్ధా పాత్రలో చరణ్ .. 'నీలాంబరి' పాత్రలో పూజ కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు .. కానీ కుదరలేదు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సోనూ సూద్ .. జిషు సేన్ గుప్తా .. సౌరవ్ లోకేశ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.
.