'ప్రగతి ఓఎస్'... జియో ఫోన్ నెక్ట్స్ లో వినియోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే!
- అత్యంత చవకగా స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్న జియో
- దీపావళికి విడుదల కానున్న జియో ఫోన్ నెక్ట్స్
- భారతీయత ఉట్టిపడేలా ఓఎస్ కు నామకరణం
- కొత్త ఫోన్ లో క్వాల్ కామ్ ప్రాసెసర్
తమ ఫోన్ లో వినియోగించే ఆపరేటింగ్ సిస్టమ్ కు జియో వర్గాలు 'ప్రగతి ఓఎస్' అని నామకరణం చేశాయి. తమ ఫోన్ ను వాడే ప్రతి ఒక్కరూ ప్రగతిపథంలో పయనించాలన్నదే తమ అభిమతమని ఓఎస్ కు 'ప్రగతి' అని పేరుపెట్టడం వెనుకగల కారణాన్ని జియో వెల్లడించింది. భారతీయత ఉట్టిపడేలా ఉన్న ప్రగతి ఓఎస్ పేరు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
స్మార్ట్ ఫోన్ ఓఎస్ లలో ఆండ్రాయిడ్ కు వచ్చినంత సక్సెస్ మరే ఇతర ఓఎస్ కు రాలేదు. మరి ప్రగతి ఓఎస్ ఎలాంటి పనితీరు కనబరుస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. కాగా, జియో ఫోన్ నెక్ట్స్ లో వేగవంతమైన కార్యకలాపాల కోసం క్వాల్ కామ్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు.