'ఆకాశం నీ హద్దురా' కాంబినేషన్ రిపీట్ కానుందా?
- సుధా కొంగరతో సూర్య చర్చలు
- గతంలో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా'
- మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
- సూర్య విషయంలో రావలసిన స్పష్టత
వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకుముందు ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారానే ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తే, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. దర్శకురాలిగా సుధా కొంగర .. సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ ఓకే. అయితే ఈ సినిమాలో సూర్య నటిస్తాడా? లేదంటే నిర్మాతగా మాత్రమే ఉంటాడా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. త్వరలోనే ఏ విషయమూ తెలిసే అవకాశం ఉంది.