నాగ్ 'ఘోస్ట్'లో అఖిల్ గెస్టు రోల్!
- నాగార్జున హీరోగా 'ఘోస్ట్'
- దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు
- కొంతవరకూ చిత్రీకరణ పూర్తి
- కీలకమైన గెస్టు రోల్
ఇక నాగార్జున చేస్తున్న 'ఘోస్ట్' సినిమాలో అఖిల్ గెస్టుగా కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నాగార్జున హీరోగా నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ 'ఘోస్ట్' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును జరుపుకుంది. ఇందులో గెస్టు రోల్ ఉండటం .. ఆ రోల్ కి ప్రాముఖ్యత ఉండటంతో అఖిల్ తో చేయించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ పేరు వినిపిస్తోంది.