ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా 'రాధే శ్యామ్' టీజర్!
- పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ
- విక్రమాదిత్యగా ప్రభాస్
- ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే
- జనవరి 14వ తేదీన విడుదల
అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా నుంచి వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తూ దూకుడు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ పుట్టినరోజు నుంచి ఇక అప్ డేట్స్ ఆలస్యం కాకుండా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.
ఆ రోజున ఉదయం 11:16 నిమిషాలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటలీ నేపథ్యంలో నడుస్తుంది. పునర్జన్మతో ముడిపడిన ఈ ప్రేమకథలో, విక్రమాదిత్యగా ప్రభాస్ .. ప్రేరణ పాత్రలో పూజ కనిపించనున్నారు
.