'వరుడు కావలెను' కొత్త రిలీజ్ డేట్!
- నాగశౌర్య నుంచి 'వరుడు కావలెను'
- ప్రేమ .. పెళ్లి మధ్య నడిచే కథ
- కీలకమైన పాత్రలో నదియా
- ఈ నెల 29వ తేదీన విడుదల
నిజానికి ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసుకోవడం జరిగింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తమన్ .. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీత దర్శకులుగా వ్యవహరించారు. కోలకళ్ల .. దిగు దిగు నాగ .. మనసులోనే నిలిచిపోకే .. అనే పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ఈ సినిమాలో నదియా కీలకమైన పాత్రను పోషించింది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు.
.