రేపు 'అన్నాత్తే' నుంచి సెకండ్ సింగిల్!
- రజనీ నుంచి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా
- యాక్షన్ .. ఎమోషన్ కి పెద్ద పీట
- ప్రదమైన ఆకర్షణగా భారీ తారాగణం
- నవంబర్ 4వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి బాలు పాడిన పాటను ఫస్టు సింగిల్ గా వదిలారు. ఆ పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు సాయంత్రం 6 గంటలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ - శ్రేయా ఘోషల్ ఆలపించగా, రజనీ ... నయనతారపై చిత్రీకరించారు.
ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించారు. వివిధ భాషల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.