ఇన్స్టాలో హీరో వెంకటేశ్ చేసిన పోస్ట్ వైరల్!
- 'మనసు ఆలోచనలతో నిండి వుంటుంది' అని వ్యాఖ్య
- మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని హితవు
- మాట్లాడేముందు మొదట కాస్త మెదడుతో ఆలోచించాలని పోస్ట్
- నాగ చైతన్య, సమంత గురించే అంటూ నెటిజన్లు కామెంట్లు
మనసు ఆలోచనలతో నిండి వుంటుందనీ, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆయన ఓ కొటేషన్ ను పేర్కొన్నారు. అంతకు ముందు కూడా మనం ఏదైనా విషయంపై మాట్లాడేముందు మొదట కాస్త మెదడుతో ఆలోచించాలని అన్నారు. సాధారణంగా వెంకటేశ్ రెగ్యులర్గా ఇటువంటి కొటేషన్లు పెడుతుంటారు. అయితే, చై-సామ్ విడిపోయిన వేళ ఆయన చేసిన పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.