టీడీపీని లేకుండా చేసేందుకు జగన్, పవన్ కుట్ర పన్నారు: హర్షకుమార్
- వైసీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి
- పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు
- పవన్ పర్యటనలకు ప్రభుత్వమే హైప్ క్రియేట్ చేస్తోంది
పవన్ పర్యటనలకు అనుమతి లేదని చెపుతూ... ప్రభుత్వమే ఆయన పర్యటనలకు హైప్ క్రియేట్ చేస్తోందని అన్నారు. జనసైనికులకు ఆవేశం వచ్చిన తర్వాత పర్యటనలకు పర్మిషన్ ఇస్తుందని విమర్శించారు. రోడ్లపై పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లను బాగు చేయాలని చెప్పారు.