పవన్ కల్యాణ్ నాపై దాడి చేయిస్తున్నాడు... చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదు?: పోసాని
- ఒకానొకప్పుడు చిరంజీవి కుటుంబాన్ని నేను కాపాడాను
- పవన్ ఊసరవెల్లి రాజకీయాల గురించి మాట్లాడితే దాడి చేస్తారా?
- నాకు ఏమైనా జరిగితే పవన్ దే బాధ్యత
ఒకానొకప్పుడు చిరంజీవి కుటుంబాన్ని తాను కాపాడానని... ఇప్పుడు ఆయన తమ్ముడు తనపై దాడులు చేయిస్తుంటే చిరంజీవి స్పందించరా? అని అడిగారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన ప్రాణాలకు రక్షణ లేదని... తనపై వ్యక్తిగతంగా దాడి జరిగే అవకాశం ఉందని... తనకు ఏదైనా జరిగితే పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అన్నారు.