దేశం కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్: ప్రకాశ్ రాజ్
- 'మా' ఎన్నికలు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాం
- పరస్పర నిందారోపణలు వద్దు
- పవన్ కు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. పవన్ ఒక గొప్ప నాయకుడని, దేశం కోసం పోరాడుతున్నారని కితాబునిచ్చారు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పారు. పవన్ కూడా 'మా' సభ్యుడేనని తెలిపారు. ఎవరు ఏది మాట్లాడినా ఇండస్ట్రీ మంచి కోసమేనని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంటుందని, ప్రేమ ఉంటుందని, వాళ్లని మాట్లాడనివ్వాలని చెప్పారు. అసోసియేషన్ అభ్యుదయం కోసం పని చేయడమే తమ లక్ష్యమని అన్నారు.