ఆ ట్వీట్ పొరబాటున చేశాను... సైదాబాద్ నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు: కేటీఆర్
- సైదాబాద్ లో బాలికపై హత్యాచారం
- కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారన్న కేటీఆర్
- తన ట్వీట్ పట్ల విచారం వ్యక్తం చేసిన వైనం
- తప్పుడు సమాచారం వల్లే ఆ ట్వీట్ చేసినట్టు వివరణ
నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడ్ని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని, తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.