విదేశాలకి వెళుతున్న 'కార్తికేయ 2'
- నిఖిల్ నుంచి 'కార్తికేయ 2'
- విదేశాల్లో చివరి షెడ్యూల్
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
- వచ్చే ఏడాదిలో విడుదల
ఈ సినిమా చివరి షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేశారు. రెండువారాల పాటు అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కానుంది. అంటే ఈ నెల చివరినాటికి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆ తరువాత గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తిచేసి, వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. ఆల్రెడీ నిఖిల్ తో '18 పేజెస్' చేసిన అనుపమ పరమేశ్వరన్, 'కార్తికేయ 2'లోను జోడీ కడుతుండటం విశేషం.