పవర్ స్టార్ అంటే ఎందుకిష్టం?.. అభిమానులకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశ్న
- పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆండ్రూ ఫ్లెమింగ్
- ఆయనంటే ఎందుకిష్టమో 10 పదాల్లో చెప్పాలని ఫ్యాన్స్‌కు క్వశ్చన్
- వైరల్ అవుతున్న ట్వీట్
- ఈరోజే పవన్ రెండు సినిమాల నుంచి రెండు గిఫ్టులు
ఆ వెంటనే ‘‘పవన్ కల్యాణ్ ఎందుకు మీ హీరో అయ్యాడు?’’ అనే ప్రశ్నకు పది పదాల్లో సమాధానం చెప్పాలని పవన్ అభిమానులను అడిగారు. ఇక అభిమానులు ఊరుకుంటారా? ఈ ట్వీట్‌కు రిప్లైల మీద రిప్లైలు ఇచ్చేస్తున్నారు. తమకు పవన్ అంటే ఎందుకు అభిమానమో చెబుతున్నారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
కాగా, పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు చిత్రాల నుంచి రెండు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆ తర్వాత కాసేపటికే రాధాకృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సర్ప్రైజ్లతో ఫుల్ జోష్‌లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్‌కు సమాధానాలిచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.