'అరణ్మనై 3' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!
- సుందర్ సి నుంచి మరో హారర్ కామెడీ
- ఆర్య సరసన రాశి ఖన్నా
- ప్రతినాయక పాత్రలో సంపత్ రాజు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఇక ఇప్పుడు 'అరణ్మనై 3' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్య - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాలో, సుందర్ సి కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సంపత్ రాజు .. నళిని .. వివేక్ .. యోగిబాబు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ వీడియో సాంగును రిలీజ్ చేశారు.
ఒక వైపున ఆర్య - రాశి ఖన్నా కాంబినేషన్లోని సాంగ్ ను చూపిస్తూనే, మరో వైపున దెయ్యం వలన బంగ్లాలో జరిగే చిత్రమైన సంఘటనలను చూపిస్తూ వెళ్లారు. మధ్యలో మేకింగ్ వీడియో షాట్స్ ను మిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన విలన్ సంపత్ రాజు అనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే సినిమాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.