బోయపాటి-రామ్ చిత్రం అప్ డేట్!
- యాక్షన్ చిత్రాలకు పెట్టిందిపేరు బోయపాటి
- ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న 'అఖండ'
- తదుపరి చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ తో
- నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'అఖండ' పేరిట యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్న బోయపాటి.. తన తదుపరి చిత్రాన్ని ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 'అఖండ' చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ముందుకొచ్చారు.
ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ రామ్ కి బాగా నచ్చిందనీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారనీ సమాచారం. ఇదిలావుంచితే, రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక బోయపాటి చిత్రాన్ని చేస్తాడట.