విజయ్ సేతుపతి 'లాభం' రిలీజ్ డేట్ ఖరారు!
- విజయ్ సేతుపతి నుంచి 'లాభం'
- తెలుగులో 'లాభం' టైటిల్ ఖరారు
- రెండు భాషల్లో వచ్చేనెల 9న రిలీజ్
- కథానాయికగా శ్రుతి హాసన్
ఒకేసారి తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ఫస్టుమూవీ ఇదేనని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సాయిధన్సిక కీలకమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కలైయరసన్ .. రమేశ్ తిలక్ కనిపించనున్నారు.
ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తమిళనాట తన జోరును కొనసాగించాలనే ఉద్దేశంతో శ్రుతిహాసన్ ఉంది. 'మాస్టర్' అనువాదం ద్వారా .. 'ఉప్పెన' సినిమా ద్వారా తెలుగులో క్రేజ్ పెంచుకున్న విజయ్ సేతుపతికి హిట్ పడుతుందేమో చూడాలి.