' కొండపొలం' నుంచి వీడియో సాంగ్!
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- ఆహ్లాదకరమైన సంగీతం
- ఆకట్టుకునే ఆలాపన
- అక్టోబర్ 8వ తేదీన సినిమా విడుదల
ఈ పాటలో హీరో పశువుల కాపరిగా కనిపిస్తుంటే, పల్లె యువతిగా రకుల్ ఆకట్టుకుంటోంది. కీరవాణి స్వరపరిచిన ఈ మెలోడీ గీతం ఒక్కసారి వినగానే మనసుకు పడుతోంది. నాయకా నాయికలు ఒకరిని గురించి ఊహలలో ఒకరు .. ఒకరి జ్ఞాపకాలలో ఒకరు ఒదిగిపోతూ పాడుకునే పాట ఇది. సున్నితమైన భావాల ఆవిష్కరణతో కూడిన సాహిత్యం .. ఆలాపన .. చిత్రీకరణ ఈ పాటను మరోస్థాయికి తీసుకువెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పాటల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు.