భావోద్వేగంలో కన్నీళ్లు వచ్చేశాయి: రకుల్ ప్రీత్ సింగ్
- చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూశా
- స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురయ్యా
- క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా విడుదల చేసిన అక్షయ్, టీమ్ కు అభినందనలు
చాలా నెలల తర్వాత థియేటర్లో సినిమా చూడటం సంతోషంగా ఉందని రకుల్ చెప్పింది. స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్ లో సినిమా విడుదల చేసిన అక్షయ్ కుమార్, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.
మరోవైపు డ్రగ్స్ కేసు విచారణకు హాజరు కావాలంటూ రకుల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు మరో 11 మంది టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 6న ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరు కావాల్సివుంది.