ఆస్ట్రేలియాలో లాక్డౌన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకం.. 250 మంది అరెస్ట్
- సిడ్నీలో రెండు నెలలుగా లాక్డౌన్
- మెల్బోర్న్, కాన్బెర్రాలలో ఈ నెల నుంచి
- లాక్డౌన్లకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు
- ఘర్షణల్లో ఏడుగురు పోలీసులకు గాయాలు
తక్షణం లాక్డౌన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మెల్బోర్న్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు చోట్ల ఘర్షణలు రేకెత్తాయి. ఈ ఘటనల్లో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అలాగే, నిరసన చేట్టిన దాదాపు 250 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే లాక్డౌన్లు విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.