విక్రమ్ హీరోగా 'మహాన్' .. ఫస్టు లుక్ రిలీజ్!
- యాక్షన్ థ్రిల్లర్ గా 'మహాన్'
- డిఫరెంట్ లుక్ తో విక్రమ్
- ప్రత్యేక పాత్రలో ధృవ్
- సగానికి పైగా చిత్రీకరణ పూర్తి
ఆయన తాజా చిత్రంగా 'మహాన్' రూపొందుతోంది. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విక్రమ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం అర్థమవుతోంది.
సిమ్రన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగును పూర్తి చేసుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.